News October 19, 2024

మెక్సికన్ ఇన్వెస్టర్లకు సీతారామన్ ఆహ్వానం

image

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మెక్సికన్ ఇన్వెస్టర్లను FM నిర్మలా సీతారామన్ ఆహ్వానించారు. GIFT-IFSCలో ఫారిన్ యూనివర్సిటీల సెటప్, GICCs, ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్, షిప్ లీజింగ్‌లో అవకాశాలను అన్వేషించాలని సూచించారు. ఆర్థిక సంబంధాలు, ఫార్మా సూటికల్స్, మెడ్ టెక్, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో గ్రోత్‌ను 2 దేశాల ప్రైవేటు సెక్టార్ లీడర్లు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కొన్ని కంపెనీలతో MoUలు కుదిరాయన్నారు.

Similar News

News November 12, 2024

స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని డిమాండ్

image

తెలంగాణలోని గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని UTF డిమాండ్ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుగుణంగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకే ఉండేలా చూడాలని సీఎస్ శాంతికుమారికి విజ్ఞప్తి చేసింది. గతంలో ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కాగా రాత్రి వరకు స్కూళ్లు ఉండటంతో తాము ఇళ్లకు వెళ్లేందుకు ఆలస్యం అవుతోందని టీచర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

News November 12, 2024

Elections: ఈ ప్రాంతాల్లో రేపే ఓట్ల పండుగ‌

image

దేశంలో మ‌రోసారి ఓట్ల పండుగ‌కు స‌మ‌య‌మొచ్చింది. ఝార్ఖండ్ అసెంబ్లీ మొద‌టి విడ‌త ఎన్నిక‌లు బుధ‌వారం జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 43 స్థానాల్లో (20 ST, 6 SC) 685 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. అలాగే వ‌య‌నాడ్ లోక్‌స‌భ స్థానానికి కూడా రేపే ఉపఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 47 అసెంబ్లీ స్థానాల‌కు ఈసీ బైపోల్స్ నిర్వ‌హించ‌నుంది. న‌వంబ‌ర్ 23న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

News November 12, 2024

Inflation: సామాన్యులపై ధరల మోత

image

కూర‌గాయ‌లు, పండ్లు, నూనెలు ఇత‌ర‌త్రా నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో అక్టోబ‌ర్‌లో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 14 నెల‌ల గ‌రిష్టాన్ని తాకి 6.21%గా న‌మోదైంది. ఇది RBI నిర్దేశించుకున్న 4% ల‌క్ష్యం కంటే అధికం. అయితే, Sepలో 5.49%గా న‌మోదవ్వ‌డం గ‌మ‌నార్హం. అర్బ‌న్ ప్రాంత ద్ర‌వ్యోల్బ‌ణం 4.62% నుంచి 5.62 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా న‌మోదైంది. ధరల మోత సామాన్యులపై పెను భారం మోపుతోంది.