News October 21, 2024

జియోకు కోటి మంది యూజర్లు గుడ్ బై!

image

రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన తర్వాత రిలయన్స్ జియోకు యూజర్లు షాక్ ఇచ్చారు. రెండవ త్రైమాసికంలో 1.07కోట్ల మంది జియోకు గుడ్ బై చెప్పినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే 5G సబ్ స్క్రైబర్స్ బేస్ మాత్రం 17మిలియన్లు పెరిగి 147 మిలియన్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. వినియోగదారుల్ని కోల్పోవడం తమ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.

Similar News

News October 21, 2024

నాగచైతన్య-శోభిత పెళ్లి పనులు ప్రారంభం

image

అక్కినేని నాగచైతన్య, శోభిత త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 8న వీరి ఎంగేజ్మెంట్ జరగగా తాజాగా పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి శోభిత పసుపు దంచుతున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో వీరి పెళ్లి ఎప్పుడా అని అభిమానుల్లో చర్చ మొదలైంది.

News October 21, 2024

పత్తి రైతులను మోసం చేస్తే చర్యలు: మంత్రి తుమ్మల

image

TG: రాష్ట్రంలో అన్ని పంటలకు ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం(D) గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కష్టమైన నష్టమైనా ప్రభుత్వం పంట కొనుగోళ్లు చేస్తుందని చెప్పారు. పత్తి రైతులను మోసం చేసే ప్రైవేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

News October 21, 2024

స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్స్

image

బంగారం ధరలు మరోసారి పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.79,640కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.73,000గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ దూసుకెళ్తోంది. నిన్నటి వరకు రూ.1,07,000 ఉండగా ఇవాళ మరో రూ.2000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేట్ రూ.1,09,000కి చేరింది.