News October 21, 2024
జియోకు కోటి మంది యూజర్లు గుడ్ బై!
రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన తర్వాత రిలయన్స్ జియోకు యూజర్లు షాక్ ఇచ్చారు. రెండవ త్రైమాసికంలో 1.07కోట్ల మంది జియోకు గుడ్ బై చెప్పినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే 5G సబ్ స్క్రైబర్స్ బేస్ మాత్రం 17మిలియన్లు పెరిగి 147 మిలియన్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. వినియోగదారుల్ని కోల్పోవడం తమ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.
Similar News
News November 13, 2024
ఐపీఎస్, ఐఏఎస్‌లు జాగ్రత్తగా ఉండాలి: కేటీఆర్
TG: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని KTR విమర్శించారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టయిన పట్నం నరేందర్ ఫ్యామిలీని ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ‘తనపై దాడి జరగలేదని కలెక్టరే చెప్పారు. మరి కేసులు ఎందుకు పెట్టారు? అధికారులు అతి చేస్తే ఏపీలో ఏం జరిగిందో చూస్తున్నాం. రాష్ట్రంలో IPS, IASలు జాగ్రత్తగా ఉండాలి. అక్రమ అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్తాం’ అని చెప్పారు.
News November 13, 2024
తన క్యాన్సర్‌ను తనే నయం చేసుకున్న శాస్త్రవేత్త!
క్రొయేషియాకు చెందిన సైంటిస్ట్ బియాటా హలాసీ(49) జాగ్రేబ్ వర్సిటీలో వైరాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆమెకు గతంలో రొమ్ము క్యాన్సర్ సోకి తగ్గింది. 2020లో మళ్లీ సోకగా సొంతంగా ఆంకాలిటిక్ వైరోథెరపీని(OVT) చేసుకున్నారు. పొంగు చూపే వైరస్, వెసిక్యులర్ స్టొమాటిటిస్ వైరస్(VSV) రెండింటినీ తన కణితిపై ప్రయోగించి క్యాన్సర్ నుంచి విముక్తురాలయ్యారు. వైద్య ప్రపంచంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
News November 13, 2024
ICC ర్యాంకింగ్స్.. నం.1 ప్లేస్‌లో పాక్ బౌలర్
ICC తాజాగా ప్రకటించిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ బౌలర్ షాహీన్‌షా అఫ్రీది నంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేశారు. మూడు వన్డేల్లో 8 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌కు ముందు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 4వ ప్లేస్‌లో ఉన్న అఫ్రీది ఏకంగా తొలి స్థానానికి దూసుకొచ్చారు. IND తరఫున కుల్దీప్(4), బుమ్రా(6), సిరాజ్(8) టాప్-10లో ఉన్నారు.