News October 22, 2024

WOW: 5 రెట్లు పెరిగిన కరోడ్‌పతి ITR ఫైలర్స్

image

దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు. AY2013-14లో రూ.కోటికి మించి Taxable Income చూపినవారి సంఖ్య 44,078. పదేళ్లలో (AY2023-24) వీరు 2.3 లక్షలకు చేరారు. ఆదాయం పెరగడం, ITR ఫైలింగ్ ఈజీ అవ్వడమే ఇందుకు కారణాలు. AY2023-24లో రూ.కోటిగా పైగా ITR ఫైల్ చేస్తున్నవారిలో ఉద్యోగులు 52% ఉన్నారు. చాలామందికి రూ.1-5 కోట్ల వరకు శాలరీ వస్తోంది. మొత్తంగా ITR ఫైల్ చేస్తున్నవారు పదేళ్లలో 3.3 కోట్ల నుంచి 7.5 కోట్లకు చేరారు.

Similar News

News October 22, 2024

15 రోజుల్లో డ్రోన్ పాలసీ: CBN

image

AP: విజయవాడ వరద సాయంలో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయని సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో అమరావతి డ్రోన్ సిటీగా మారనుందని చెప్పారు. డ్రోన్ల ఆవిష్కరణలో దేశానికి ఏపీ కేంద్రం కానుందని పేర్కొన్నారు. దీని కోసం 15 రోజుల్లో డ్రోన్ పాలసీని తీసుకొస్తామన్నారు. డ్రోన్ హబ్ ఏర్పాటుకు ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.

News October 22, 2024

మత మార్పిడి వివాదంలో చిక్కుకున్న టీమ్ఇండియా క్రికెటర్!

image

క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని ముంబై జింఖానా క్లబ్ రద్దు చేసింది. ఆమె తండ్రి ఇవాన్ క్లబ్ ప్రెసిడెన్షియల్ హాల్‌లో మత మార్పిళ్లను ప్రోత్సహిస్తుండటమే ఇందుకు కారణం. ‘Brother Manuel Ministries’ తరఫున ఆయన 35 ఈవెంట్లు నిర్వహించారని క్లబ్ మెంబర్ శివ మల్హోత్ర అన్నారు. ‘దేశవ్యాప్తంగా కన్వర్షన్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడిది మా వద్దే జరిగింది. క్లబ్‌లో ఇలాంటివి నిషేధం’ అని తెలిపారు.

News October 22, 2024

డ్రోన్స్.. ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్: CBN

image

AP: రాబోయే రోజుల్లో డ్రోన్స్ గేమ్ ఛేంజర్స్ కానున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సమ్మిట్ 2024లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ఇప్పుడు అది దేశంలోనే గొప్ప నగరంగా ఉందన్నారు. 1995లోనే ఐటీ గురించి ఆలోచించి, అనేక కంపెనీలను తీసుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో డేటానే కీలకమని, ఎన్ని డబ్బులు ఉన్నాయనేది కాదని, ఎంత డేటా ఉందనేది గొప్పగా చూస్తారని చెప్పారు.