News October 22, 2024
WOW: 5 రెట్లు పెరిగిన కరోడ్‌పతి ITR ఫైలర్స్

దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు. AY2013-14లో రూ.కోటికి మించి Taxable Income చూపినవారి సంఖ్య 44,078. పదేళ్లలో (AY2023-24) వీరు 2.3 లక్షలకు చేరారు. ఆదాయం పెరగడం, ITR ఫైలింగ్ ఈజీ అవ్వడమే ఇందుకు కారణాలు. AY2023-24లో రూ.కోటిగా పైగా ITR ఫైల్ చేస్తున్నవారిలో ఉద్యోగులు 52% ఉన్నారు. చాలామందికి రూ.1-5 కోట్ల వరకు శాలరీ వస్తోంది. మొత్తంగా ITR ఫైల్ చేస్తున్నవారు పదేళ్లలో 3.3 కోట్ల నుంచి 7.5 కోట్లకు చేరారు.
Similar News
News January 18, 2026
గర్భిణులు పారాసిటామాల్ వాడొచ్చు!

గర్భిణులు పారాసిటామాల్ ట్యాబ్లెట్ వాడొచ్చని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. దీని వల్ల పుట్టే పిల్లలకు ఆటిజం రాదని, మెదడు ఎదుగుదలపై ఎఫెక్ట్ ఉండదని పేర్కొంది. స్వీడన్, జపాన్‌కు చెందిన 26లక్షల మంది పిల్లల డేటాను విశ్లేషించిన సైంటిస్టులు పారాసిటామాల్ వాడకంపై స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఈ ట్యాబ్లెట్ వల్ల పిల్లలకు ముప్పు అని SMలో ప్రచారం జరిగింది. అటు గర్భిణులకు ఉన్న అనుమానాలనూ ఈ నివేదిక తొలగించింది.
News January 18, 2026
చంద్ర దోష నివారణకు నేడు సువర్ణవకాశం..

అమావాస్య నాడు చంద్రకళలు క్షీణించి ఉంటాయి. అందుకే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారికి మానసిక అశాంతి కలుగుతుంది. దీని నివారణకు చొల్లంగి అమావాస్య సరైన రోజని జ్యోతిషులు చెబుతున్నారు. ‘తెల్లని వస్త్రంలో బియ్యం, చిన్న వెండి చంద్రుని ప్రతిమను పెట్టి, తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సాయంత్రం వేళ ప్రవహించే నదీ జలాల్లో ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని, తెల్లని పూలను విడిచిపెట్టాలి’ అని సూచిస్తున్నారు.
News January 18, 2026
NASA ఆఫర్.. మూడ్రోజులే ఛాన్స్

చంద్రుడిని చుట్టి వచ్చేందుకు NASA <<18861755>>ఆర్టెమిస్-2<<>> టెస్ట్ ఫ్లైట్ మిషన్ చేపట్టింది. ఇందులో ప్రజలను భాగం చేసేందుకు ‘సెండ్ యువర్ నేమ్’ క్యాంపైన్ రన్ చేస్తోంది. రిజిస్టర్ చేసుకున్న వారి పేర్లను SD కార్డ్‌లో వేసి ఆస్ట్రోనాట్స్‌తో పాటు పంపుతారు. 10 రోజులపాటు మీ పేరు చంద్రుడిని చుట్టొస్తుంది. వారి పేరుతో బోర్డింగ్ పాస్ కూడా ఇస్తున్నారు. JAN 21తో ఈ క్యాంపైన్ ముగుస్తుంది. రిజిస్టర్ చేసుకునేందుకు <


