News October 22, 2024
సొంత గుర్తింపు కోసం ఎంతో కష్టపడ్డా: కృతి సనన్

పదేళ్ల కెరీర్‌లో పెద్ద సినిమాల్లో నటించినా తనను ‘టైగర్ ష్రాఫ్ హీరోయిన్’ అనే పిలిచేవారని కృతి సనన్ చెప్పారు. ఆ పేరు పోగొట్టుకోవాలని, సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినీ నేపథ్యం లేకపోతే ప్రేక్షకులు ఇలాంటి పేర్లు పెట్టేస్తారన్నారు. ఈమె మహేశ్‌బాబు సరసన ‘1 నేనొక్కడినే’తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్‌తో కలిసి బాలీవుడ్‌లో ‘హీరోపంటీ’ మూవీలో నటించారు.
Similar News
News April 3, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.
News April 3, 2026
ECIL, హైదరాబాద్‌లో 32 ఉద్యోగాలు

కాంట్రాక్ట్ ప్రాతిపదికన 32 పోస్టుల భర్తీకి ECIL, హైదరాబాద్.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్-14, టెక్నికల్ ఆఫీసర్-8, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్-3, సీనియర్ ఆర్టీజన్-7 ఉన్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ITI/డిప్లొమా/BE/బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-33 మధ్య ఉండాలి. APR- 9,18న ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు www.ecil.co.in చూడండి.
News April 3, 2026
ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగండి: సోనూసూద్

ప్రస్తుతం జరుగుతున్న భారీ <<19527926>>లేఆఫ్స్‌పై<<>> నటుడు సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం బాధాకరమని, సంక్షోభం నుంచే రేపటి పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగం కోసం వెతకడమే కాకుండా భవిష్యత్తులో కంపెనీలను స్థాపించే దిశగా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టాలను అధిగమించి విజేతలుగా ఎదగాలని యువతకు సూచించారు.


