News October 22, 2024

సొంత గుర్తింపు కోసం ఎంతో కష్టపడ్డా: కృతి సనన్

image

పదేళ్ల కెరీర్‌లో పెద్ద సినిమాల్లో నటించినా తనను ‘టైగర్ ష్రాఫ్ హీరోయిన్’ అనే పిలిచేవారని కృతి సనన్ చెప్పారు. ఆ పేరు పోగొట్టుకోవాలని, సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినీ నేపథ్యం లేకపోతే ప్రేక్షకులు ఇలాంటి పేర్లు పెట్టేస్తారన్నారు. ఈమె మహేశ్‌బాబు సరసన ‘1 నేనొక్కడినే’తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్‌తో కలిసి బాలీవుడ్‌లో ‘హీరోపంటీ’ మూవీలో నటించారు.

Similar News

News November 5, 2024

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ మారుస్తారా?

image

AP: జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను అభ్యర్థుల వినతి మేరకు వాయిదా వేయడంపై అధికారులు చర్చిస్తున్నారు. DSC పరీక్షల తేదీలను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని, డీవైఈవో పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీలు చిరంజీవి, లక్ష్మణరావు APPSC ఛైర్‌పర్సన్ అనురాధకు విజ్ఞప్తి చేశారు.

News November 5, 2024

డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్

image

పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్ బుక్ ఫెయిర్ మళ్లీ వచ్చేస్తోంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రకటించింది. స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునేవారు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో పుస్తక ప్రదర్శన మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేదని, ఈసారి మ.12 గంటల నుంచి రా.9 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

News November 5, 2024

ఆరు నెలలకోసారి కొత్త పింఛన్లు: మంత్రి కొండపల్లి

image

AP: ఎన్టీఆర్ భరోసా కింద జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత 6 నెలలకోసారి అర్హతను బట్టి కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు. భర్త చనిపోయినవారు డెత్ సర్టిఫికెట్ సమర్పించిన మరుసటి నెల నుంచే పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానం డిసెంబర్ నుంచే అమలు చేయాలన్నారు.