News October 22, 2024

కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి ఆ క్రీడలు తొలగింపు

image

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి క్రికెట్, హాకీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలను నిర్వాహకులు తొలగించారు. ఖర్చును తగ్గించుకునేందుకు కేవలం 10 క్రీడలతో నిర్వహిస్తామని ప్రకటించారు. గతంలో ఈ స్పోర్ట్స్‌లోనే భారత్ ఎక్కువ మెడల్స్ సాధించింది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం భారత్‌కు ప్రతికూలంగా మారింది. 2022లో 19 క్రీడల్లో ఈ పోటీలు జరిగాయి.

Similar News

News October 22, 2024

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. సచివాలయంలో ఉ.11 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్త పన్ను రద్దు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అలాగే 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ చర్చించనుంది.

News October 22, 2024

రేపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ

image

భార‌త ప్ర‌ధాని మోదీ, చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌ల భేటీ ఖరారైంది. ఐదేళ్ల తర్వాత వీరిద్దరు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా బుధవారం ఈ భేటీ జరగనుంది. ఈ విషయాన్ని భార‌త విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రీ వెల్లడించారు. తూర్పు లద్దాక్‌లో పెట్రోలింగ్‌పై భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం భేటీ జరగనుండడం గమనార్హం.

News October 22, 2024

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి: కేంద్రమంత్రి

image

మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే వార్తలను కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ ఖండించారు. ప్రపంచంలో చమురు కొరత ఏమాత్రం లేదని, కావాల్సిన దానికంటే ఎక్కువే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 73 డాలర్లుగా ఉంది.