News October 22, 2024
కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి ఆ క్రీడలు తొలగింపు
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి క్రికెట్, హాకీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలను నిర్వాహకులు తొలగించారు. ఖర్చును తగ్గించుకునేందుకు కేవలం 10 క్రీడలతో నిర్వహిస్తామని ప్రకటించారు. గతంలో ఈ స్పోర్ట్స్‌లోనే భారత్ ఎక్కువ మెడల్స్ సాధించింది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం భారత్‌కు ప్రతికూలంగా మారింది. 2022లో 19 క్రీడల్లో ఈ పోటీలు జరిగాయి.
Similar News
News November 7, 2024
Stock Markets: నిన్నటి లాభాల్లో సగం పోయె..
భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. క్రూడాయిల్ ధరల పెరుగుదల, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. సెన్సెక్స్ 79,927 (-450), నిఫ్టీ 24,360 (-123) వద్ద ట్రేడవుతున్నాయి. మీడియా, PSU బ్యాంక్, రియాల్టి, Oil & Gas సూచీలు పుంజుకున్నాయి. మెటల్, ఫార్మా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. హిందాల్కో, Adani Ent, సిప్లా, అల్ట్రాటెక్ సెమ్ టాప్ లూజర్స్.
News November 7, 2024
‘ఘాటి’లో అనుష్క వైల్డ్ లుక్
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇవాళ జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సిగార్ పీలుస్తూ ఆగ్రహంతో ముఖం నిండా రక్తంతో ఉన్న ఆమె వైల్డ్ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదం’ తర్వాత వారి కాంబోలో తెరకెక్కుతున్న రెండో మూవీ ఇది. ఇవాళ సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది.
News November 7, 2024
20 పరుగుల తేడాతో 10 వికెట్లు
రంజీ ట్రోఫీలో భాగంగా J&Kతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ కుప్పకూలింది. 53/0 స్థితి నుంచి 73 పరుగులకే ఆలౌటైంది. 20 పరుగుల తేడాతో 10 మంది బ్యాటర్లు ఔటయ్యారు. నలుగురు డకౌట్ కాగా, మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఓపెనర్లు బమంబా 21, అర్పిత్ 24 రన్స్ చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి.