News October 23, 2024

కాసేపట్లో కోర్టుకు కేటీఆర్

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో నాంపల్లి స్పెషల్ కోర్టుకు వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖ‌పై పరువు నష్టం పిటిషన్ వేసిన ఆయన అందుకు సంబంధించి స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. గత విచారణ సందర్భంగా కొంత సమయం కావాలని కేటీఆర్ అడిగారు. దీంతో విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. మరోవైపు తమ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సురేఖపై హీరో నాగార్జున కూడా పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 23, 2024

ముగిసిన క్యాబినెట్ భేటీ

image

AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. భేటీ వివరాలను సీఎం చంద్రబాబు సాయంత్రం 4గంటలకు ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు. ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త మద్యం పాలసీ, అసెంబ్లీ సమావేశాలు, వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం, పోలవరం, అమరావతిలో ప్రాజెక్టుల నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

News October 23, 2024

రేపు మ.12 గంటలకు ఏం జరగనుంది?

image

AP: టీడీపీ, వైసీపీ చేసిన తాజా ట్వీట్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ‘Big Expose’ అంటూ తొలుత టీడీపీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ‘truth bomb dropping’ అని వైసీపీ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్టులకు అర్థం ఏంటి? రేపు ఏం చెప్పబోతున్నాయి? అని టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి మరి.

News October 23, 2024

రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: KTR

image

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై వేటువేయాలని MLC జీవన్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై KTR స్పందించారు. ‘రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే మీరు చేసిన MLAల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా? జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేత ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు’ అని ట్వీట్ చేశారు.