News October 23, 2024
కాసేపట్లో కోర్టుకు కేటీఆర్

TG: మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో నాంపల్లి స్పెషల్ కోర్టుకు వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్ వేసిన ఆయన అందుకు సంబంధించి స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. గత విచారణ సందర్భంగా కొంత సమయం కావాలని కేటీఆర్ అడిగారు. దీంతో విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. మరోవైపు తమ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సురేఖపై హీరో నాగార్జున కూడా పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 7, 2025
ఆత్మవిశ్వాసాన్ని నింపే ‘వందేమాతరం’: మోదీ

వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానమని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీలో జరిగిన 150వ స్మారకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘ఈ గీతంలోని శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపుతుంది. భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తుంది. ఈ గీతం ఒక సంకల్పం, ఒక మంత్రం, ఒక స్వప్నం. ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది. సామూహిక గీతాలాపన అద్భుత అనుభవం’ అని పేర్కొన్నారు.
News November 7, 2025
లెస్బియన్ అఫైర్.. 6 నెలల బిడ్డను చంపిన తల్లి?

తన భార్య మరో మహిళతో అఫైర్ పెట్టుకుని 6 నెలల బిడ్డను చంపి ఉండొచ్చని తండ్రి ఆరోపించారు. తమిళనాడు కృష్ణగిరి(D)లో ఈ ఘటన జరిగింది. కొన్ని రోజుల కిందట బేబీ మరణించగా, అనారోగ్యమే కారణమనుకుని పోస్టుమార్టం చేయకుండానే పూడ్చిపెట్టారు. తాజాగా భార్య ఫోన్‌లో లెస్బియన్ చాటింగ్‌ను గుర్తించిన భర్త.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇవాళ బేబీ బాడీకి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
News November 7, 2025
న్యూస్ అప్‌డేట్స్ @10AM

*గన్నవరం చేరుకున్న ప్రపంచకప్ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణి. మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో భేటీ
*BRS ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు. ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతంలో రైడ్స్ ఏంటని రవీందర్ రావు ఆగ్రహం
*ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య.. 100కు పైగా ఫ్లైట్లు ఆలస్యం


