News October 23, 2024

జట్టును నిర్ణయించేది సోషల్ మీడియా కాదు: గంభీర్

image

టీమ్ ఇండియా‌లో క్రికెటర్ KL.రాహుల్ చోటుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కోచ్ గంభీర్ స్పందించారు. వాటితో తమకు అవసరం లేదని, మేనేజ్మెంట్ ఏం అనుకుంటుందనేదే తమకు ముఖ్యమన్నారు. జట్టును ఎంపిక చేసేది నెటిజన్లు కాదన్నారు. రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నారని, అతడు పెద్ద స్కోర్లు చేయాలని భావిస్తున్నాడని తనకు అనిపిస్తోందని గౌతీ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రేపు ప్రారంభం కానుంది.

Similar News

News October 23, 2024

BRICSలో పాక్‌కు షాక్!

image

బ్రిక్స్ సదస్సులో పాక్‌కు షాక్ తగిలింది. తన మిత్రదేశం చైనా కీలక సభ్యదేశమైనప్పటికీ ఇస్లామాబాద్‌ను బ్రిక్స్ విస్తరణలో పరిగణించలేదు. భారత్‌ వ్యతిరేకించడంతో రష్యాలో జరుగుతున్న సదస్సులో పాక్ ప్రతినిధికి స్థానం కూడా దక్కలేదు. బ్రిక్స్ విస్తరణలో ఇప్పటికే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE, సౌదీ అరేబియా చేరాయి. తుర్కియే, అజర్‌బైజాన్, మలేషియా దరఖాస్తు చేసుకున్నాయి.

News October 23, 2024

దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?

image

దీపావళి పండుగను ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి అక్టోబర్ 31న మ.3.52 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సా.6.16 ని.కు ముగుస్తుంది. దీని ప్రకారం 31న సా.5.36 నుంచి 6.16 వరకు లక్ష్మీ పూజ ముహూర్తం ఉంది. ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే దృక్ పంచాంగం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 1న దీపావళి జరుపుకోనున్నారు.

News October 23, 2024

YS జగన్‌కు మంత్రి లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్

image

AP: దిశ చట్టం, శాంతి భద్రతలపై డిబేట్‌కు రావాలని YS జగన్‌కు మంత్రి లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ‘జగన్ తన పార్టీ నేతలు, తన మీడియాతో అబద్ధాలు ప్ర‌చారం చేయిస్తున్నాడు. దిశ చట్టాన్ని నిలిపివేశామని అంటాడు. అసలు ఆ చట్టమే లేదు. YCP హయాంలో నేరాలు భారీగా పెరిగాయి. YCP పోలీస్ వ్యవస్థను ప్రతిపక్షాలను హింసించడానికి వాడింది. వీటిపై డిబేట్‌కు రాకుంటే తాను ఫేక్ అని జగన్ ఒప్పుకున్నట్లే’ అని ట్వీట్ చేశారు.