News March 17, 2025
శుభ ముహూర్తం (17-03-2025)

☛ తిథి: బహుళ తదియ సా.4.57 వరకు తదుపరి చవితి ☛ నక్షత్రం: చిత్త మ.12.41 వరకు తదుపరి స్వాతి ☛ శుభ సమయం:1. ఉ.06.09 నుంచి 6.45 వరకు సా.7.21 నుంచి 7.45 వరకు ☛ రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
☛ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు ☛ దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 1.12వరకు 2. మ.2.46 నుంచి 3.34 వరకు ☛ వర్జ్యం: సా.6.46నుంచి 8.31 వరకు☛ అమృత ఘడియలు: ఉ.7.21
Similar News
News April 22, 2025
విషాదం.. వడదెబ్బతో 9 మంది మృతి

TG: రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరి కొన్ని చోట్ల ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వడదెబ్బతో 9 మంది మరణించారు. ఖమ్మం, KNR, నాగర్ కర్నూల్‌లో ముగ్గురు, ఉమ్మడి ADLBలో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News April 22, 2025
‘రాజాసాబ్’ టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ Xలో ట్రెండవుతోంది. ఈ చిత్ర టీజర్ మేలో రాబోతున్నట్లు సినీవర్గాలు పేర్కొనడంతో అభిమానులు దీనిపై ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ సినిమాలో ఇంతవరకూ చూడని విజువల్స్, VFXను టీజర్‌లో చూపించారని వార్తలొస్తున్నాయి. అయితే, టీజర్ కట్, సీజీ పనులు పూర్తయ్యాయని, ప్రభాస్ డబ్బింగ్ చెప్పడమే మిగిలి ఉందని సమాచారం.
News April 22, 2025
నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌కు పాక్ అథ్లెట్!

ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెలలో బెంగళూరులో JSW స్పోర్ట్స్ ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేయబోతోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ జావెలిన్ క్రీడాకారులను ఆహ్వానిస్తున్నారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ని కూడా ఆహ్వానించినట్లు నీరజ్ తెలిపారు. కోచ్‌తో మాట్లాడి కన్ఫార్మ్ చేస్తానని ఆయన చెప్పారని పేర్కొన్నారు.