News October 24, 2024
BSNL కనెక్టింగ్ భారత్‌పై నెటిజన్ల చర్చ ఎలా ఉందంటే!

BSNL కొత్త లోగోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లోగోలో భారత్ మ్యాప్‌ను ఉంచడం, కనెక్టింగ్ ఇండియా ట్యాగ్‌లైన్‌ను కనెక్టింగ్ భారత్‌గా మార్చడం బాగుందని కొందరు అంటున్నారు. భారతీయత కనిపిస్తోందని చెప్తున్నారు. మార్చాల్సింది లోగో కాదని, బిజినెస్ స్ట్రక్చర్, అందించాల్సిన సేవలని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెప్పుడు 4G, 5G అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. DD లోగో మార్చినప్పుడూ ఇలాంటి కామెంట్సే వచ్చాయి.
Similar News
News March 17, 2025
RECORD: FY25లో ₹1.75 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి

భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. FY25 తొలి 11 నెలల్లోనే రూ.1.75లక్షల కోట్ల ($21B) విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. IT మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అంచనా వేసిన $20Bతో పోలిస్తే ఇది ఎక్కువే. FY24లో ఎగుమతి చేసిన $15.6Bతో చూస్తే ఏకంగా 54% ఎక్కువ. భారత్ నుంచి అమెరికా, బ్రిటన్, UAE, నెదర్లాండ్స్‌కు యాపిల్, శామ్‌సంగ్ మొబైళ్లు ఎగుమతి అవుతున్నాయి. అందులో USకే 50% కన్నా ఎక్కువ వెళ్తున్నాయి.
News March 17, 2025
ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లోనే రూ.24 కోట్లు

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.
News March 17, 2025
అన్ని జిల్లాల పర్యటనకు కేటీఆర్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్‌లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.