News October 24, 2024

ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తారా?: అక్బరుద్దీన్

image

TG: మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులను MIM నేత అక్బరుద్దీన్ కలిశారు. ఖరీదైన ఇళ్లను కూల్చేసి వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. అలా చేస్తే కుదరదని తేల్చి చెప్పారు. తామెప్పుడూ ప్రభుత్వాలకు తలొగ్గలేదని, అన్ని రాజకీయ పార్టీలు మూసీపై రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులు వారి వ్యాపారాలు ఇక్కడుంటే ఎక్కడికో ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు.

Similar News

News March 17, 2025

RECORD: FY25లో ₹1.75 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి

image

భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. FY25 తొలి 11 నెలల్లోనే రూ.1.75లక్షల కోట్ల ($21B) విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. IT మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అంచనా వేసిన $20Bతో పోలిస్తే ఇది ఎక్కువే. FY24లో ఎగుమతి చేసిన $15.6Bతో చూస్తే ఏకంగా 54% ఎక్కువ. భారత్ నుంచి అమెరికా, బ్రిటన్, UAE, నెదర్లాండ్స్‌కు యాపిల్, శామ్‌సంగ్ మొబైళ్లు ఎగుమతి అవుతున్నాయి. అందులో USకే 50% కన్నా ఎక్కువ వెళ్తున్నాయి.

News March 17, 2025

ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లోనే రూ.24 కోట్లు

image

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.

News March 17, 2025

అన్ని జిల్లాల పర్యటనకు కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్‌లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.

error: Content is protected !!