News October 24, 2024

బ్రిటిష్ హ‌యాం నాటి బంగ్లాలో షేక్ హసీనా!

image

బంగ్లా EX PM షేక్ హ‌సీనాకు భార‌త ప్ర‌భుత్వం ఢిల్లీలోని ఓ లుటియ‌న్స్ బంగ్లాలో వ‌స‌తి కల్పించింది! అన్ని వసతులు, గార్డెన్ ఉండేలా లుటియ‌న్స్ బంగ్లాల‌ను 20వ శ‌తాబ్దంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. హసీనా గ‌త హోదాను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రుల‌కు కేటాయించ‌ద‌గిన బంగ్లానే ఆమెకూ కేటాయించారు. భద్రత మధ్య లోధీ గార్డెన్స్‌కి త‌ర‌చుగా ఆమె వాక్‌కి వెళ్తున్న‌ట్టు తెలిసింది.

Similar News

News January 3, 2025

రోహిత్ రెస్ట్ తీసుకుంటున్నారా? తప్పించారా?

image

BGT 5వ టెస్టులో రోహిత్‌కు బదులు బుమ్రా టాస్‌కు రావడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. నిన్న IND జట్టులో మార్పులుంటాయని, రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ఊహాగానాలొచ్చిన విషయం తెలిసిందే. వాటిని నిజం చేస్తూ రోహిత్ జట్టులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుమ్రా చెప్పినట్లు హిట్ మ్యాన్ తాను ‘ఆడను, రెస్ట్ తీసుకుంటా’ అని చెప్పారా? కావాలనే జట్టు నుంచి తప్పించారా? అనే అంశం చర్చనీయాంశమైంది.

News January 3, 2025

ఇవాళ అకౌంట్లోకి డబ్బులు: ప్రభుత్వం

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. పలువురి ఖాతాల్లో గురువారం రాత్రి జమ కాగా, మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి. కాగా జనవరి 1న సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగింది.

News January 3, 2025

చర్లపల్లి రైల్వే టెర్మినల్ 6న ప్రారంభం

image

TG: చర్లపల్లిలో రూ.430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్‌ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. గత నెల 28నే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ పీఎం మన్మోహన్ మృతి కారణంగా వాయిదా పడింది. సికింద్రాబాద్ స్టేషన్‌పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు.