News October 24, 2024
బ్రిటిష్ హయాం నాటి బంగ్లాలో షేక్ హసీనా!

బంగ్లా EX PM షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఓ లుటియన్స్ బంగ్లాలో వసతి కల్పించింది! అన్ని వసతులు, గార్డెన్ ఉండేలా లుటియన్స్ బంగ్లాలను 20వ శతాబ్దంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. హసీనా గత హోదాను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రులకు కేటాయించదగిన బంగ్లానే ఆమెకూ కేటాయించారు. భద్రత మధ్య లోధీ గార్డెన్స్‌కి తరచుగా ఆమె వాక్‌కి వెళ్తున్నట్టు తెలిసింది.
Similar News
News July 10, 2025
ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

బిహార్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం(ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు ఆధార్, ఓటర్ ID, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిటిజన్‌షిప్ నిర్ధారణకు JUN 24న ECI సబ్మిట్ చేసిన 11రకాల డాక్యుమెంట్లు కూడా సమగ్రమైనవి కాదంది. సిటిజన్‌షిప్ నిర్ధారించాల్సింది ECI కాదని పేర్కొంది. JUL 21లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంది. విచారణను JUL 28కి వాయిదా చేసింది.
News July 10, 2025
మోదీ, జగన్ మధ్య అక్రమ పొత్తు: YS షర్మిల

AP: మోదీకి జగన్ దత్తపుత్రుడు అని, వారి మధ్య అక్రమ పొత్తు ఉందని షర్మిల ఆరోపించారు. ‘మోదీ మద్దతుతో జగన్ ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. తలకాయల మీద కార్లు పోనిచ్చినా, మామిడి కాయలు తొక్కుకుంటూ వెళ్లినా, రప్పా రప్పా నరుకుతామని హెచ్చరించినా చీమంత చర్య కూడా ఉండదు’ అని ట్వీట్ చేశారు. జగన్ పర్యటనకు పైకి 500 మందితో అనుమతి ఇస్తారు కానీ 10వేల మందితో వచ్చినా కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె విమర్శించారు.
News July 10, 2025
టాస్ ఓడిన భారత్.. జట్టులోకి బుమ్రా

లార్డ్స్ వేదికగా టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చారు. IND(XI): జైస్వాల్, రాహుల్, నాయర్, గిల్, పంత్(Wk), జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా, నితీశ్. ENG(XI): క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్(Wk), వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.