News October 25, 2024

రైతులకు అలర్ట్.. వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

image

AP: రబీ నుంచి 2019కు ముందున్న పంటల బీమా విధానాన్నే అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. PM ఫసల్ బీమా పథకానికి పంటల వారీగా నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని తెలిపింది. లోన్లు తీసుకోని రైతులు గ్రామ సచివాలయాలు, ఉమ్మడి సేవా కేంద్రాల్లో ప్రీమియం చెల్లించవచ్చని, https://pmfby.gov.in/ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. జీడిమామిడికి NOV 15లోగా ప్రీమియం చెల్లించాలని పేర్కొంది.

Similar News

News March 18, 2025

TODAY HEADLINES

image

* ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
* CM చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
* 11 మంది సెలబ్రిటీలపై కేసులు
* ఏ ప్రభుత్వమూ ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్
* అప్పుడు నావల్లే పార్టీ ఓడిపోయింది: చంద్రబాబు
* సీనియర్ నటి బిందు ఘోష్ కన్నుమూత
* వైసీపీ పాలనలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి: పవన్
* TG ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం: TTD

News March 18, 2025

ఓయూలో ఆంక్షలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

image

TG: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై ప్రభుత్వం నిషేధం విధించడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించింది ఓయూ విద్యార్థులే అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని, పోలీసుల పహారాలో ఆ హక్కును అణచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం అంగీకరించదని హెచ్చరించారు.

News March 18, 2025

మొబైల్ రేడియేషన్ పెరిగితే.. ప్రమాదమే!

image

సెల్‌ఫోన్‌ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్. SAR ప్రకారం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6వాట్‌లకు మించొద్దు. *#07# డయల్ చేసి రేడియేషన్ చెక్ చేయొచ్చు. పక్షులు, చెట్లపై కూడా ఇది ప్రభావం చూపుతుంటుంది. రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులొస్తాయి. NCBI సర్వే ప్రకారం రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలొస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఎదురవ్వొచ్చు. SHARE IT

error: Content is protected !!