News March 18, 2025
ఓయూలో ఆంక్షలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

TG: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై ప్రభుత్వం నిషేధం విధించడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించింది ఓయూ విద్యార్థులే అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని, పోలీసుల పహారాలో ఆ హక్కును అణచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం అంగీకరించదని హెచ్చరించారు.
Similar News
News April 23, 2025
డీఈఈ సెట్ దరఖాస్తులు ప్రారంభం

AP: రెండేళ్ల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 20న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. జూన్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహించి అదే నెల 10న అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: <
News April 23, 2025
ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.
News April 23, 2025
ఇవాళ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్దతు

ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ జమ్మూకశ్మీర్‌లో బంద్‌కు JKHC, CCIK, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చాయి. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్లో క్యాండిల్‌లైట్లతో నిరసన తెలపనున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి.