News October 25, 2024
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను కిందకి దించి తనిఖీలు చేస్తున్నారు. ఆ విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 5, 2026
వారికి తెలిసే తప్పు చేశారు: పవన్

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.
News February 5, 2026
ICAR-IARIలో ఉద్యోగాలు

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<
News February 5, 2026
YCP భగవంతుడిపై పగ పట్టింది: పవన్

AP: YCP హయాంలో హిందూత్వంపై అనేక దాడులు జరిగాయని Dy.CM పవన్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి మీడియా సమావేశం నిర్వహించింది. ‘వీళ్లు భగవంతుడిపై పగబట్టారు. 59.70 లక్షల కిలోల కల్తీ పామాయిల్‌తో చేసిన కోట్ల లడ్డూల్లో కొన్ని అయోధ్య కూడా పంపారు. వీళ్లు చెప్పిన కల్తీ నెయ్యికి సంబంధించి ఆన్ రికార్డ్ సాక్ష్యాలు కూడా దొరికాయి. భగవంతుడిపై పగబట్టిన వాళ్లు సర్వనాశనం అయిపోతారు’ అని పేర్కొన్నారు.


