News October 25, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను కిందకి దించి తనిఖీలు చేస్తున్నారు. ఆ విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 10, 2024

3,50,000 మంది పిల్లలకు పాలు.. ఈ తల్లికి సెల్యూట్

image

తల్లి పాలకు మించిన పౌష్టికాహారం ఏదీలేదు. కానీ చాలా మంది పిల్లలకు ఈ పాలు అందడం లేదు. వారికోసం USకు చెందిన అలీస్ ఓగ్లెట్రీ(36) పెద్ద మనసు చాటుకున్నారు. 2023 జులై నాటికి తన బ్రెస్ట్ మిల్క్‌ను 2,645L దానం చేసి గిన్నిస్ రికార్డును సాధించారు. గతంలోనూ 1,569L పాలను అందించారు. తాను 3,50,000 మంది పిల్లలకు సాయం చేసినట్లు ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు. సరోగేట్ మదర్‌గానూ సేవ చేశారు.

News November 10, 2024

ఆస్ట్రేలియా బయల్దేరిన విరాట్ కోహ్లీ

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా బయల్దేరారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆయన వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోహ్లీతోపాటు రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి బీజీటీ ప్రారంభం కానుంది.

News November 10, 2024

కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. రైల్వేపై నెటిజన్ల ఫైర్

image

బిహార్‌లోని బరౌనీకి చెందిన ఓ రైల్వే ఉద్యోగి <<14569710>>కప్లింగ్<<>> చేస్తూ ఇంజిన్-బోగీ మధ్య ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు చలించిపోయి రైల్వేపై మండిపడుతున్నారు. ఆటోమేటిక్ కప్లింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా రైల్వే శాఖ తమ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఫైర్ అవుతున్నారు.