News October 25, 2024

హమాస్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్?

image

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కైరోలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో మొస్సాద్ చీఫ్ డేవిడ్ బోర్నియా కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ చర్చలకు యూఎస్, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరుదేశాలు కాల్పులను విరమిస్తాయని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌పై యుద్ధం చేసేందుకే ఇరాన్ మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News October 25, 2024

2024 US elections: ఎల‌క్టోర‌ల్ ఓట్ల గురించి (2/3)

image

50 Statesలో జ‌నాభా ఆధారంగా ఎల‌క్టోర‌ల్ ఓట్లు 435 ఉన్నాయి. ప్ర‌తి రాష్ట్రానికి 2 ఎల‌క్టోర‌ల్ ఓట్లు సెనెట్ ద్వారా వ‌స్తాయి. తద్వారా మొత్తం 535 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. వాషింగ్టన్ డీసీకి 3 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి (Winner-take-all). వీరు డిసెంబర్‌లో అధ్య‌క్షుడిని ఎన్నుకుంటారు. జ‌నవ‌రిలో కాంగ్రెస్ ధ్రువీక‌రిస్తుంది.

News October 25, 2024

2024 US elections: ఎంత బలం అవసరం?(1/3)

image

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలక్టోరల్ కాలేజ్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ అయినప్పటికీ, నేరుగా ప్రజలు అధ్యక్షుడిని ఎన్నుకోరు. వారు తమ సొంత రాష్ట్రంలో ఎలక్టర్లకు ఓటు వేస్తారు. ఈ ఎలక్టర్లు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, అభ్యర్థికి గెలవడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ప్రతి రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ప్రజలు వీరికి ఓటేస్తారు.

News October 25, 2024

పాపులర్ ఓటు Vs ఎల‌క్టోర‌ల్ ఓటు.. ఏది ముఖ్యం? (3/3)

image

పాపుల‌ర్ ఓట్ల (ప్ర‌జ‌లు వేసే ఓట్లు) కంటే ఎల‌క్టోర‌ల్ ఓట్లే కీల‌కం. పాపుల‌ర్ ఓట్లు ఎక్కువ సాధించినా ఎల‌క్టోర‌ల్ ఓట్లలో విఫ‌ల‌మై ప‌లువురు అధ్య‌క్ష పీఠానికి దూర‌మయ్యారు. 2000లో అల్గోర్ 48.4%, బుష్ 47.9% ఓట్లు సాధించారు. అయితే బుష్ 271 ఎల‌క్టోర‌ల్ ఓట్లు పొంద‌గా, అల్గోర్ 266 పొందారు. ఇక 2016లో హిల్ల‌రీ 48.2%, ట్రంప్ 46% ఓట్లు పొందారు. అయితే 304 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలిచిన ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు.