News October 25, 2024
హమాస్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కైరోలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో మొస్సాద్ చీఫ్ డేవిడ్ బోర్నియా కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ చర్చలకు యూఎస్, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరుదేశాలు కాల్పులను విరమిస్తాయని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌పై యుద్ధం చేసేందుకే ఇరాన్ మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News November 13, 2024
అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు సమంజసమే: హైకోర్టు
AP: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తే తప్పేం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్ వేయగా ధర్మాసనం ఇవాళ విచారించింది.
News November 13, 2024
ప్రభుత్వాలు ‘బుల్డోజర్ యాక్షన్’ ఎలా తీసుకోవచ్చంటే..
అక్రమ కట్టడాలపై <<14598300>>బుల్డోజర్<<>> యాక్షన్‌కు దిగేముందే పాటించాల్సిన గైడ్‌లైన్స్‌ను SC వివరించింది. ఆ ప్రాపర్టీ ఓనర్‌కు 15days ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలంది. ఒకటి రిజిస్టర్ పోస్టులో పంపాలని, మరోటి ప్రాపర్టీపై నేరుగా అతికించాలని సూచించింది. ఉల్లంఘించిన రూల్స్, కూల్చివేతకు కారణాలు వివరించాలని, కూల్చివేతను వీడియో తీయించాలని ఆదేశించింది. ఇందులో ఏది పాటించకున్నా కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామంది.
News November 13, 2024
రియల్ ఎస్టేట్ కోసం భూములు లాక్కుంటున్నారు: KTR
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూసేకరణ పేరిట పేదల భూములను లాక్కుంటోందని కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ కొడంగల్ సమస్యను పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని ప్రశ్నించారు