News October 25, 2024

ముద్ర రుణాల పరిమితి పెంపు

image

ముద్ర రుణాల పరిమితిని కేంద్రం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు 3 రకాలుగా రూ.50వేలు, రూ.50వేలు నుంచి రూ.5లక్షలు, రూ.5-10లక్షలు లోన్స్ అందించింది. తాజాగా రూ.10-20 లక్షల రుణాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15-12.80 వడ్డీతో పొందొచ్చు.

Similar News

News January 13, 2026

ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా చేయండి

image

☛ఒక గిన్నెలో డిష్‌వాష్ లిక్విడ్ వేసి అందులో నగలు నాననివ్వాలి. తర్వాత మెత్తని బ్రష్‌తో తోమి శుభ్రం చేస్తే మునుపటి రూపు సంతరించుకుంటాయి.
☛ డిటర్జెంట్ పౌడర్, ఒక చెక్క నిమ్మరసం వేడి నీటిలో కలిపి ఆభరణాలను వేసి 5నిమిషాలు ఉంచాలి.
☛బంగారు గాజులను నీటిలో నానబెట్టి రెండు చెంచాల శనగపిండిలో తగినంత వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించాలి. తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి.

News January 13, 2026

10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ బంద్

image

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన యాడ్స్ ఇవ్వకూడదంటూ బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్థలకు సూచించారు. కాగా 10 ని. నిబంధనను ఎత్తివేయాలంటూ కొత్త ఏడాదికి ముందు గిగ్ వర్కర్లు నిరసన చేపట్టారు. దీంతో సంస్థలకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

News January 13, 2026

సంక్రాంతి: ఈ పరిహారాలు పాటిస్తే బాధలు దూరం

image

పుష్య మాసం, మకర రాశి శని దేవుడికి ప్రీతిపాత్రమైనవి. సంక్రాంతి రోజున శని అనుగ్రహం కోసం నువ్వుల నలుగుతో స్నానం చేయాలి. దారిద్ర్యం పోవాలంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయాలి. పితృదేవతలకు తర్పణాలు వదిలితే కుటుంబానికి సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ రోజు పెరుగు దానం చేయడం వల్ల సంతాన క్షేమం, సంపద, ఆయుష్షు లభిస్తాయి. ఈ చిన్న పరిహారాలు పాటిస్తే సకల బాధలు తొలగి శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.