News October 25, 2024
ముద్ర రుణాల పరిమితి పెంపు
ముద్ర రుణాల పరిమితిని కేంద్రం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు 3 రకాలుగా రూ.50వేలు, రూ.50వేలు నుంచి రూ.5లక్షలు, రూ.5-10లక్షలు లోన్స్ అందించింది. తాజాగా రూ.10-20 లక్షల రుణాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15-12.80 వడ్డీతో పొందొచ్చు.
Similar News
News November 10, 2024
అంగన్వాడీలను GOVT ఉద్యోగులుగా పరిగణించాలి.. గుజరాత్ హైకోర్టు
అంగన్వాడీ సిబ్బందిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. నాలుగో తరగతి కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ₹15K ఇస్తుంటే అంగన్వాడీలకు ₹5-10K గౌరవ వేతనమే ఇస్తున్నారని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో వారిని GOVTసర్వీసులోకి తీసుకుని పే స్కేల్ గురించి పేర్కొనాలని ధర్మాసనం తీర్పుఇచ్చింది. ఇది అమలైతే దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది.
News November 10, 2024
ప్రభాస్ ‘సలార్-2’లో కొరియన్ నటుడు?
ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘సలార్-2’లో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ నటించనున్నట్లు సమాచారం. తాజాగా ఆయన ‘సలార్-2’ పోస్టర్‌ను ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టుకోవడంతో ఈ మూవీలో నటించనున్నారనే చర్చ మొదలైంది. ‘ది ఔట్‌లాస్’, ‘ది గ్యాంగ్ స్టర్’, ‘అన్‌స్టాపబుల్’, ‘ఛాంపియన్’ వంటి హాలీవుడ్, కొరియన్ చిత్రాల్లో ఆయన నటించారు. అంతకుముందు స్పిరిట్‌లోనూ డాన్ లీ నటిస్తారనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
News November 10, 2024
నీతులు వల్లించడం మీకే చెల్లింది: VSR
AP: వ్యక్తిత్వ హననం చేస్తూ నీతులు వల్లించడం మీకే చెల్లిందంటూ CM చంద్రబాబుపై YCP ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ‘ప్రధాని మోదీ సతీమణి గారిని బహిరంగంగానే నిందించింది ఎవరు? ప్రధాని తల్లిగారిని ప్రస్తావించింది ఎవరు? YSR కుమార్తెను వేధించేందుకు ఇంటి నుంచి వెబ్‌సైట్లు నడిపింది ఎవరు? వీటికన్నా ముందే సొంత మామను నగ్నంగా చిత్రీకరించింది(కార్టూన్స్‌ని ఉద్దేశించి) ఎవరు?’ అని నిలదీశారు.