News October 26, 2024

అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో: చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వ హయాంలో తనను అరెస్ట్ చేయకపోయినా కూటమి పొత్తు ఏర్పడేదేమో అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘మనం నిమిత్తమాత్రులమే. విధి స్పష్టంగా ఉంటుంది. అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో. నా అరెస్ట్ పొత్తు నిర్ణయానికి మరింత ఊతమైంది. సరైన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారు’ అని అన్నారు.

Similar News

News October 26, 2024

ఎలక్ట్రీషియన్ల సేవలు కోసం ఊర్జవీర్ స్కీమ్

image

AP: రాష్ట్రంలోని 1.2లక్షల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ‘ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీం’ కింద వినియోగించుకోవాలని GOVT నిర్ణయించింది. కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను వీరి సాయంతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం, వీధి దీపాల నిర్వహణలో వీరి సేవలను వినియోగించుకుంటామని CM చంద్రబాబు తెలిపారు.

News October 26, 2024

క్వాలిటీ టెస్టులో ఈ మందులు ఫెయిల్

image

49 రకాల మందులు క్వాలిటీ స్టాండర్డ్స్‌లో ఫెయిల్ అయ్యాయని CDSCO తెలిపింది. వీటిలో క్యాల్షియం-500mg, విటమిన్ D3(లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ లేబొరేటరీ ), పారాసిటమోల్(కర్ణాటక యాంటిబయాటిక్స్), మెట్రోనిడజోల్(హిందూస్థాన్ యాంటీబయాటిక్స్), డొంపరిడోన్(రైన్‌బో లైఫ్ సైన్సెస్), పాన్-40(ఆల్కెమ్ ల్యాబ్స్) తదితర మెడిసిన్ ఉన్నట్లు వెల్లడించింది. నకిలీ కంపెనీలు తయారుచేసిన 4 రకాల మందులను గుర్తించినట్లూ తెలిపింది.

News October 26, 2024

తొలి ప్రదర్శనకే బెస్ట్ యాక్టర్‌గా గుర్తింపు: మెగాస్టార్

image

మెగాస్టార్ చిరంజీవి తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. తాను రంగస్థలం మీద వేసిన తొలినాటకం ‘రాజీనామా’కు బెస్ట్ యాక్టర్‌గా తొలిసారి గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. ‘కోన గోవింద రావు గారు రచించిన రాజీనామా నాటకానికి బెస్ట్ యాక్టర్‌గా గుర్తింపు రావడం ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చింది. 1974 -2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానంలో ఎనలేని ఆనందం పొందాను’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.