News March 18, 2025

రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

AP: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రేపు 58 మండలాల్లో, ఎల్లుండి 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని <>APSDMA<<>> వెల్లడించింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా ORS, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించింది.

Similar News

News April 24, 2025

హిమాచల్ ప్రదేశ్‌లో హైఅలర్ట్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచల్‌ప్రదేశ్‌లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌తో బార్డర్‌ను పంచుకునే చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.

News April 24, 2025

ఓటముల్లో SRH సెంచరీ

image

SRH ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. IPL హిస్టరీలో 100 ఓటములను ఎదుర్కొన్న ఏడో టీమ్‌గా నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో ఢిల్లీ(137), పంజాబ్(137), ఆర్సీబీ(132), KKR(125), ముంబై(121), రాజస్థాన్(113), CSK(105) ఉన్నాయి. SRHకు ముందు 2008-12 మధ్య హైదరాబాద్ వేదికగా ఉన్న డెక్కన్ ఛార్జర్స్ 75 మ్యాచ్‌లలో 46సార్లు ఓడిపోయింది.

News April 24, 2025

మే 20న అంగన్వాడీల సమ్మె

image

AP: వేతనాల పెంపుతో పాటు వేసవి సెలవులు, సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మే 20న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. లబ్ధిదారులకు అందించే సరుకులన్నీ విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని, ఫేస్ యాప్ ఇన్, ఔట్ లొకేషన్ తొలగించాలని వారు కోరుతున్నారు.

error: Content is protected !!