News October 26, 2024
ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ

AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మిగిలిన కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఏపీఈఏపీ సెట్, నీట్ ర్యాంకులతో సంబంధం లేకుండా ఇంటర్ మార్కులతో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని తెలిసింది. 2025-26 నుంచి ఇండియన్ నర్సింగ్ కౌన్సెల్ మార్గదర్శకాలు అనుసరించి NTR హెల్త్ వర్సిటీ ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని పేర్కొన్నారు.
Similar News
News March 18, 2025
NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు?: షర్మిల

AP: చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని షర్మిల అన్నారు. ‘NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారు. YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు?’ అని ప్రశ్నించారు.
News March 18, 2025
రేపు తెలంగాణ బడ్జెట్

TG: అసెంబ్లీ కమిటీ హాల్‌లో రేపు ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఉ.11.14 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో, మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కీలక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది.
News March 18, 2025
పెద్ద దేవళాపురం@42.7 డిగ్రీలు

AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉలిందకొండలో 42.6, ఖాజీపేటలో 41.8, దరిమడుగులో 41.5, నాగసముద్రం, వత్తలూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే నమోదవడం గమనార్హం. అలాగే 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 42 మండలాల్లో వడగాలులు వీచాయని APSDMA వెల్లడించింది.