News October 26, 2024

నందిగం సురేశ్‌పై మరో కేసు

image

AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో కేసు నమోదైంది. గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చేందుకు రైతుల శిబిరాలకు వచ్చిన ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై నందిగం సురేశ్, అతని అనుచరులు దాడి చేశారని ఓ BJP నేత ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో సురేశ్ స్వయంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే TDP ఆఫీసుపై దాడి, ఓ మహిళ హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి.

Similar News

News October 26, 2024

యూజర్లకు జియో దీపావళి ఆఫర్లు

image

టెలికం దిగ్గజం జియో దీపావళి ధమాకా పేరుతో యూజర్ల కోసం ఆఫర్లు ప్రకటించింది. రూ.899, రూ.3599 రీఛార్జ్ ప్లాన్లపై రూ.3350(ఈజీమై ట్రిప్, AJIO, స్విగ్గీ ఓచర్లు) విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. రూ.899 ప్లాన్ ద్వారా 90 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాతో పాటు అదనంగా 20GB డేటా లభిస్తుంది. రూ.3599 ప్లాన్‌లో 365 రోజులు రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం పొందవచ్చు.

News October 26, 2024

దీపావళికి 20% తగ్గనున్న గోల్డ్ డిమాండ్.. ఎందుకంటే!

image

గత ఏడాదితో పోలిస్తే ఈ దీపావళి, ధంతేరాస్‌కు గోల్డ్ డిమాండ్ 15-20% తగ్గుతుందని జువెలర్స్ అంచనా వేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమన్నారు. దాదాపుగా వీరి వార్షిక అమ్మకాల్లో 30-40% ఈ సీజన్లోనే నమోదవుతుంది. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, ఐఫోన్ 16, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ స్కీములను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం గోల్డ్ 10grams ధర రూ.81వేలుగా ఉంది.

News October 26, 2024

AI అవకాశాలతో APని అభివృద్ధి చేస్తాం: లోకేశ్

image

ట్రెండింగ్‌లో ఉన్న AI అవకాశాలను వినియోగించుకుని APని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. USA శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘AI ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తున్నాం’ అని వెల్లడించారు.