News October 26, 2024

రోహిత్ ఫ్లాప్ షో

image

హిట్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ టెస్టుల్లో ఫ్లాప్ అవుతున్నారు. NZతో సెకండ్ టెస్టులో 0,8 రన్స్‌కే పరిమితమయ్యారు. చివరి 8 టెస్టుల్లో ఆయన కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగారు. టీమ్ గెలుపు కోసం ముందుండి ఆడాల్సిన కెప్టెనే ఇలా సింగిల్ డిజిట్‌కు పరిమితమవడంతో నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లోనైనా అండగా నిలవాల్సిందని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. రోహిత్ ప్రదర్శనపై మీ కామెంట్?

Similar News

News October 26, 2024

12 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో సిరీస్ ఓటమి

image

4331 రోజులుగా అనేక మేటి జట్లు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయాయి. ఈ 12 ఏళ్లలో ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్ సాధించింది. 2012 తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి తెలియని భారత్‌ను సునాయాసంగా ఓడించింది. మూడు మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. న్యూజిలాండ్‌కు భారత్‌లో ఇదే తొలి సిరీస్ విజయం. భారత్‌కు 18 సిరీస్‌ విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి.

News October 26, 2024

ప్రాణ త్యాగం చేసైనా వక్ఫ్ బిల్లును అడ్డుకుంటాం: మౌలానా ఖ‌లీద్

image

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును అడ్డుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖ‌లీద్ సైఫుల్లా అన్నారు. ‘ఇది మాకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య. ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ బిల్లు అమలును అడ్డుకొని తీరుతాం. అవసరమైతే ముస్లింలు జైల్ భరో కార్యక్రమాలు చేపడతారు’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ‌మే అత్య‌ధికంగా వ‌క్ఫ్ ఆస్తుల‌ను ఆక్ర‌మించిందని మౌలానా ఆరోపించారు.

News October 26, 2024

క్రెడిట్ కార్డులపై బ్యాంకుల దీపావళి ఆఫర్స్

image

కస్టమర్లకు బ్యాంకులు గుడ్‌న్యూస్ చెప్పాయి. దీపావళి, ధంతేరాస్‌ షాపింగ్ చేసేందుకు క్రెడిట్ కార్డుపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్, ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్, గోల్డ్ జువెలరీ, మొబైళ్లు, దుస్తుల కొనుగోలుపై ICICI, HDFC, AXIS BANKS, SBI కార్డ్స్ డీల్స్ ప్రకటించాయి. జియో మార్ట్, జొమాటో, స్విగ్గీ, యాపిల్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మింత్రా, తనిష్క్‌తో టై‌అప్స్ పెట్టుకున్నాయి.