News October 26, 2024
రోహిత్ ఫ్లాప్ షో
హిట్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ టెస్టుల్లో ఫ్లాప్ అవుతున్నారు. NZతో సెకండ్ టెస్టులో 0,8 రన్స్‌కే పరిమితమయ్యారు. చివరి 8 టెస్టుల్లో ఆయన కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగారు. టీమ్ గెలుపు కోసం ముందుండి ఆడాల్సిన కెప్టెనే ఇలా సింగిల్ డిజిట్‌కు పరిమితమవడంతో నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లోనైనా అండగా నిలవాల్సిందని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. రోహిత్ ప్రదర్శనపై మీ కామెంట్?
Similar News
News November 5, 2024
ఈ రెండు నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే
కార్తీక, మార్గశిర మాసాల కారణంగా ఈ రెండు నెలలు భారీగా వివాహాలు జరగనున్నాయి. నవంబర్ 7, 8, 9, 10, 13, 14, 17, 18, 20, 21, 23, 25, 27, డిసెంబర్ 4, 5, 6, 7, 8, 9, 11, 20, 23, 25, 26 తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు అరకోటి జంటలు ఒక్కటవుతాయని, రూ.6 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని నిపుణులు <<14533225>>అంచనా<<>> వేస్తున్నారు.
News November 5, 2024
రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా వేటు.. రాష్ట్ర ఆదాయానికి పోటు: KTR
TG: రాష్ట్ర ఆదాయానికి జీవధార అయిన రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా వేటు వేసిందని KTR అన్నారు. ముందుచూపు లేని ప్రభుత్వ నిర్ణయాలతో ఆదాయానికి పోటు పడిందని ట్వీట్ చేశారు. ‘కేవలం పరిపాలన దక్షత లోపం. విజన్ లేని పాలనా విధానమే దీనికి కారణం. KCR పాలనలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ మంటూ ఉరికింది. కాంగ్రెస్ పాలనలో నై నై అంటోంది’ అని విమర్శించారు. HMDA ఆదాయం, రిజిస్ట్రేషన్లు, రాబడులు తగ్గాయన్న వార్తలను షేర్ చేశారు.
News November 5, 2024
US బ్యాలెట్‌లో ‘బెంగాలీ’.. భారత్ నుంచి ఇదొక్కటే!
ఇవాళ జరిగే US ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అక్కడ బ్యాలెట్ పేపర్‌తోనే పోలింగ్ జరుగుతుంది. దీంతో వివిధ భాషల్లో బ్యాలెట్లను అందుబాటులో ఉంచారు. అందులో భారత్ నుంచి బెంగాలీ మాత్రమే చోటు దక్కించుకుంది. మన జాతీయ భాష హిందీ అయినప్పటికీ న్యూయార్క్‌లో బెంగాలీల సంఖ్య ఎక్కువ. అందుకే 2013 నుంచి ఆ భాషను బ్యాలెట్‌లో కొనసాగిస్తున్నారు. దాంతోపాటు చైనీస్, స్పానిష్, కొరియన్ లాంగ్వేజెస్‌లో అందుబాటులో ఉంటుంది.