News October 26, 2024
ALTT ఓటీటీపై ఫిర్యాదులు

ALTT ఓటీటీపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు సమాచార మాజీ కమిషనర్ ఉదయ్ మహుర్కర్ ఆధ్వర్యంలోని సేవ్ కల్చర్-సేవ్ భారత్ ఫౌండేషన్ ఫిర్యాదు చేసింది. సదరు OTT అసభ్యకర కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చి పోక్సో, ఐటీ చట్టాల్ని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక-అసభ్యకరమైన కంటెంట్ అందుబాటులో ఉండడమే దేశంలో అత్యాచారాలకు ప్రధాన కారణమని ఉదయ్ పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
కిమ్ ఆగడాలు.. మూవీస్ షేర్ చేస్తే చంపేశారు!

నార్త్ కొరియాపై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ‘2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలైన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారిన్ మూవీస్, K-డ్రామాలు షేర్ చేసుకున్నారని ఎంతో మందిని చంపేశారు’ అని నివేదికలో ఉంది.
News September 15, 2025
మైథాలజీ క్విజ్ – 6

1. వ్యాస భాగవతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేంటి?
3. కంసుడు పరిపాలించిన రాజ్యం?
4. మొధెరా సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రావణ మాసం పౌర్ణమి నాడు వచ్చే పండగ ఏది? (సరైన సమాధానాలను కామెంట్ చేయండి. జవాబులను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
<<17696624>>మైథాలజీ క్విజ్ – 5<<>> ఆన్సర్స్: 1.భూమి, ఆకాశం 2.త్రయంబకేశ్వర ఆలయం 3.మాఘ మాసం 4.భీష్ముడు 5.సీత
News September 15, 2025
ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి: CM చంద్రబాబు

AP: నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖల మంత్రులకు CM చంద్రబాబు లేఖలు రాశారు. ‘US టారిఫ్స్‌తో ఆక్వా రంగానికి రూ.25 వేల కోట్ల నష్టం జరిగింది. 50 శాతం ఆర్డర్లు రద్దయ్యాయి. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలి. ఆక్వా రుణాల వడ్డీలపై మారటోరియం విధించాలి’ అంటూ సీఎం విజ్ఞప్తి చేశారు.