News October 27, 2024
నాణ్యతలో రాజీ పడవద్దు: పవన్ కళ్యాణ్

AP: ఉపాధిహామీ పనుల నాణ్యతలో రాజీపడొద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని, ఉపాధిహామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిన్న పలు పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేసిన ఫొటోలను పవన్ పంచుకున్నారు. గత ప్రభుత్వం చేసినట్లు నిధులు పక్కదారి పట్టించవద్దని పవన్ ఈ సందర్భంగా కోరారు.
Similar News
News September 13, 2025
షాకింగ్: HD క్వాలిటీతో ‘మిరాయ్’ పైరసీ!

కొత్త సినిమాలను పైరసీ బెడద వీడట్లేదు. నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘మిరాయ్’ సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మూవీ HD క్వాలిటీతో అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఇది దారుణమని, సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మేకర్స్ దీనిపై దృష్టి పెట్టి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
News September 13, 2025
సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యం: CM చంద్రబాబు

AP: 15% వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పౌరసేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 3% వృద్ధి తగ్గడంతో రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందన్నారు.
News September 13, 2025
కృష్ణా జలాల వాటాలో చుక్కనీటిని వదలొద్దు: రేవంత్

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని సీఎం రేవంత్ న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. నికర, మిగులు, వరద జలాల్లో చుక్క నీటిని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేసి అందించాలని అధికారులు, న్యాయనిపుణులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరిగే ట్రిబ్యునల్ విచారణలో ఈ అంశాలను గట్టిగా వినిపించాలని సూచించారు.