News October 27, 2024
నాణ్యతలో రాజీ పడవద్దు: పవన్ కళ్యాణ్

AP: ఉపాధిహామీ పనుల నాణ్యతలో రాజీపడొద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని, ఉపాధిహామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిన్న పలు పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేసిన ఫొటోలను పవన్ పంచుకున్నారు. గత ప్రభుత్వం చేసినట్లు నిధులు పక్కదారి పట్టించవద్దని పవన్ ఈ సందర్భంగా కోరారు.
Similar News
News July 10, 2025
రైతులు మీకు దొంగలు, రౌడీలుగా కనిపిస్తున్నారా?: జగన్

AP: మామిడి రైతులు సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కళ్లకు దొంగలు, రౌడీల్లాగా కనిపిస్తున్నారా? అని మాజీ CM జగన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవకపోగా వారిపై వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాబు పాలకుడు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. 76 వేల రైతు కుటుంబాల సమస్యను గాలికొదిలేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రైతులకు అండగా నిలబడండి’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
News July 10, 2025
ప్రేమ పెళ్లి.. వరుడికి 79, వధువుకు 75 ఏళ్లు

ప్రేమకు వయసుతో సంబంధం లేదని కేరళకు చెందిన ఓ వృద్ధ జంట నిరూపించింది. రామవర్మపురంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 79 ఏళ్ల విజయ రాఘవన్, 75 ఏళ్ల సులోచన మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ఆ రాష్ట్ర మంత్రి ఆర్.బిందు, సిటీ మేయర్ వర్గీస్, అధికారులు హాజరయ్యారు.
News July 10, 2025
విమాన ప్రమాదంపై వైరలవుతున్న లేఖ ఫేక్: PIB

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక అంటూ వైరలవుతున్న లేఖ ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. ఆ నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేయలేదని పేర్కొంది. సరైన సమాచారాన్ని అధికార వర్గాల ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. గత నెల 12న జరిగిన విమాన ప్రమాదంలో 34 మంది స్థానికులతో కలిపి 275 మంది మరణించినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ ప్రకటించింది.