News October 28, 2024
నేటి ముఖ్యాంశాలు
* TG: కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లో పార్టీ.. డ్రగ్ టెస్టులో ఒకరికి పాజిటివ్
* ఫిర్యాదు వస్తేనే పోలీసుల సోదాలు.. మంత్రుల ప్రకటన
* రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ పార్టీ: KTR
* ఆర్టీసీలో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం: భట్టి
* AP: కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ పాపమే: టీడీపీ
* జగన్ ఓ విషపు నాగు: షర్మిల
* షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా: VSR
Similar News
News November 1, 2024
భారీగా డ్రగ్స్ పట్టివేత
TG: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను DRI అధికారులు తనిఖీ చేయగా 7కేజీల హైడ్రోఫోనిక్ వీడ్ లభ్యమైంది. NTPS చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీజ్ చేసిన ఈ నిషేధిత పదార్థం విలువ రూ.7కోట్లు ఉంటుందని సమాచారం.
News November 1, 2024
సూర్య-జ్యోతికల పిల్లలను చూశారా?
తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూసేవారున్నారు. అయితే, తన భార్య నటి జ్యోతికతో తప్ప పిల్లలతో ఆయన మీడియా ముందు కనిపించరు. తాజాగా కుటుంబమంతా కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ ఫొటో వైరలవుతోంది. దీంతో ఈ దంపతుల పిల్లలు ఇంత ఎదిగిపోయారా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News November 1, 2024
రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్
TG: పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ తెలిపారు. నిన్న Xలో ప్రజలతో కేటీఆర్ సంభాషణలను BRS ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని, ప్రజల పక్షాన కొట్లాడడమే తమ ప్రస్తుత బాధ్యత అని చెప్పారు. BRS నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.