News October 28, 2024
నేటి ముఖ్యాంశాలు
* TG: కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లో పార్టీ.. డ్రగ్ టెస్టులో ఒకరికి పాజిటివ్
* ఫిర్యాదు వస్తేనే పోలీసుల సోదాలు.. మంత్రుల ప్రకటన
* రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ పార్టీ: KTR
* ఆర్టీసీలో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం: భట్టి
* AP: కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ పాపమే: టీడీపీ
* జగన్ ఓ విషపు నాగు: షర్మిల
* షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా: VSR
Similar News
News November 13, 2024
కలకలం.. టిక్‌టాక్ స్టార్ ప్రైవేట్ వీడియోలు లీక్
పాకిస్థాన్‌లో వరుసగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు లీక్ అవ్వడం సంచలనం రేపుతోంది. తాజాగా టిక్‌టాక్ స్టార్ ఇంషా రెహ్మాన్‌కు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు వాట్సాప్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆమె తన SM అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం. గతనెల మరో టిక్‌టాక్ స్టార్ మినాహిల్ మాలిక్ తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియోలూ బయటికి రావడం కలకలం రేపింది.
News November 13, 2024
‘గడియారం’పై విచారణ.. సొంతకాళ్లపై నిలబడాలన్న సుప్రీంకోర్టు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు వాడరాదని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్యకర్తలకు ఈ విషయం తెలియజేయాలని పేర్కొంది. సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ నేతృత్వంలోని NCP గడియారం గుర్తును వాడకుండా ఆదేశించాలన్న పిటిషన్‌ను కోర్టు విచారించింది. NOV 20 మహారాష్ట్రలో పోలింగ్ డే.
News November 13, 2024
విక్కీ కౌశల్ పరశురాముడిగా ‘మహావతార్’!
స్త్రీ, భేడియా వంటి సినిమాలతో హిట్లు కొట్టిన దర్శకుడు అమర్ కౌశిక్ పరశురాముడి కథతో ‘మహావతార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీస్తున్నామని, 2026 క్రిస్‌మస్‌కు రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ తెలిపింది. పూర్తిగా పురాణ గాథలా కాకుండా ఆధునిక కాలానికి, పరశురాముడి కథకు లింక్ ఉండేలా స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం.