News October 28, 2024

రుడా ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు

image

TG:రామగుండం కార్పొరేషన్ కేంద్రంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. పెద్దపల్లి జిల్లా మొత్తాన్ని రుడా పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు 191 గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో చేరడంపై గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక ప్రభుత్వం GO జారీ చేసే ఛాన్సుంది.

Similar News

News February 7, 2026

టీమ్ ఇండియాకు షాక్.. కుప్పకూలిన టాపార్డర్

image

టీ20 వరల్డ్ కప్: అమెరికాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాక ఇషాన్, తిలక్ కాస్త ఫామ్‌లో కనిపించారు. కానీ కాసేపటికే ఇషాన్(20) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. రెండు బంతుల తేడాతోనే తిలక్(25) కూడా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. శివమ్ దూబే కూడా గోల్డెన్ డక్ అయ్యారు. 6వ ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. భారత్ స్కోర్ 7 ఓవర్లలో 49/4గా ఉంది.

News February 7, 2026

ఇండియాలో నివసించే ప్రతిఒక్కరూ హిందువే: మోహన్ భాగవత్

image

హిందూ అనే పదం పేరు కాదని, అది ఒక విశేషణం అని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఇండియాలో నివసించే ప్రతిఒక్కరినీ హిందువుగా సంబోధించొచ్చని పేర్కొన్నారు. RSS ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. తమకు అధికారం, పబ్లిసిటీ కూడా అవసరం లేదన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి యాక్టర్ సల్మాన్ ఖాన్, హేమా మాలినీ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

News February 7, 2026

100లో 31 మాత్రమే స్మార్ట్ సిటీలుగా మారాయ్!

image

100 నగరాల్లో కేవలం 31 మాత్రమే ఇప్పటి వరకు స్మార్ట్ సిటీలుగా మారినట్లు కేంద్రం ఓ RTIకి సమాధానమిచ్చింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటీ లేవు. ఈ నగరాల కోసం పదేళ్లలో ₹59,385Cr ఖర్చు చేసింది. వైజాగ్ సహా మరో 43 నగరాల్లో పనులు దగ్గరపడినట్లు తెలిపింది. కాకినాడ, తిరుపతితో పాటు 26 పట్టణాలు స్మార్ట్ సిటీస్‌గా మారేందుకు టైమ్ పడుతుందని పేర్కొంది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది.