News October 28, 2024

రుడా ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు

image

TG:రామగుండం కార్పొరేషన్ కేంద్రంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. పెద్దపల్లి జిల్లా మొత్తాన్ని రుడా పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు 191 గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో చేరడంపై గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక ప్రభుత్వం GO జారీ చేసే ఛాన్సుంది.

Similar News

News November 9, 2025

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద అప్టేట్

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.

News November 9, 2025

‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్‌లో చూసి..

image

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్‌లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.

News November 9, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్‌లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.