News October 28, 2024

పాకిస్థాన్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

image

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ టీమ్ వైట్ బాల్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీని PCB నియమించింది. నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లకు ఆయన కోచ్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. గ్యారీ కిర్‌స్టెన్ రిజైన్‌ను యాక్సెప్ట్ చేసినట్లు ప్రకటించింది. AUS తరఫున 71 టెస్టులు, 97 వన్డేలు ఆడిన గిలెస్పీ మొత్తం 401 వికెట్స్ తీశారు. ప్రస్తుతం పాక్ టెస్ట్ టీమ్ కోచ్‌గా ఉన్నారు.

Similar News

News January 12, 2026

సోమవారం ఉపవాసం ఉంటున్నారా?

image

సోమవారం ఉపవాసం ఉంటే మానసిక ప్రశాంతత, స్వీయ నియంత్రణ లభిస్తాయి. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి కూడా ఈ ఉపవాసాన్ని ఆచరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున భక్తులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం మారేడు దళాలు, తుమ్మి పూలతో పూజించి ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించాలి. రోజంతా భక్తితో గడిపి, సాయంత్రం సాత్విక ఆహారం తీసుకుంటే కోరికలు నెరవేరి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి.

News January 12, 2026

ధనుర్మాసం: ఇరవై ఎనిమిదో రోజు కీర్తన

image

‘స్వామీ! మేము అడవిలో పశువులను కాచుకునే అజ్ఞానులం. లోక మర్యాదలు తెలియక మిమ్ము ‘‘కృష్ణా, గోవిందా’’ అని పిలిచాం. మా అపరాధాలు మన్నించు’ అని గోపికలు వేడుకున్నారు. పరమాత్మ తమ కులంలో జన్మించడం తమ అదృష్టమని, ఈ బంధం ఎప్పటికీ తెగనిదని భావించారు. తమ అమాయకపు భక్తిని అనుగ్రహించి, వ్రతాన్ని పూర్తి చేసే భాగ్యం ప్రసాదించమని, మోక్షాన్ని ఇచ్చే ఆ పదవిని తమకు దక్కేలా చేయమని శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 12, 2026

నేడు సుప్రీంకోర్టులో పోలవరం-బనకచర్లపై విచారణ

image

TG: నేడు సుప్రీంకోర్టులో ఏపీ-తెలంగాణ జల వివాదంపై విచారణ జరగనుంది. AP తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ (బనకచర్ల) లింక్ ప్రాజెక్ట్‌ను ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వరద నీటిని తరలించే పేరుతో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించింది. ఈ పిటిషన్‌ను విచారించిన CJI సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సమగ్ర వివరాలతో స్పెషల్ సూట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.