News October 28, 2024

పాకిస్థాన్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

image

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ టీమ్ వైట్ బాల్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీని PCB నియమించింది. నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లకు ఆయన కోచ్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. గ్యారీ కిర్‌స్టెన్ రిజైన్‌ను యాక్సెప్ట్ చేసినట్లు ప్రకటించింది. AUS తరఫున 71 టెస్టులు, 97 వన్డేలు ఆడిన గిలెస్పీ మొత్తం 401 వికెట్స్ తీశారు. ప్రస్తుతం పాక్ టెస్ట్ టీమ్ కోచ్‌గా ఉన్నారు.

Similar News

News February 9, 2026

విమానాల నిర్వహణపై డిప్లొమా కోర్సు

image

TG: డిప్లొమా ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(AME) కోర్సును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశపెట్టి తర్వాత విస్తరించనుంది. ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని తెలుస్తోంది. విమాన మరమ్మతులు, నిర్వహణ, సర్టిఫై తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కొత్తగా సెమీకండక్టర్, ఆటోమేషన్& రోబోటిక్స్ వంటి మరో 9 కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.

News February 9, 2026

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. నేడు పట్టువస్త్రాల సమర్పణ

image

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ రెండోరోజు సాయంత్రం ద్వారకా తిరుమల ఆలయం తరఫున పట్టువస్త్రాలను పండితులు సమర్పిస్తారు. రాత్రి స్వామి అమ్మవార్లకు భృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి 16 వరకు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేస్తారు. ఈ నెల 18 వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.

News February 9, 2026

ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాక్ షరతులు?

image

T20 WCలో INDతో మ్యాచ్‌ ఆడేందుకు ICCకి పాక్ 3 షరతులు పెట్టిందని తెలుస్తోంది. ‘రెవెన్యూలో షేర్ పెంచాలి. ఇండియాతో ద్వైపాక్షిక క్రికెట్‌ను పునరుద్ధరించాలి. హ్యాండ్‌షేక్ ప్రొటోకాల్ కొనసాగించాలి’ అని కోరిందని సమాచారం. ICC, PCB మధ్య భేటీ ముగిసిందని, 24గంటల్లో పాక్ నిర్ణయం తీసుకోనుందని క్రీడావర్గాలు తెలిపాయి. మరోవైపు ఇదే మీటింగ్‌లో తమకు పరిహారం, ఓ ICC ఈవెంట్ నిర్వహణ హక్కులివ్వాలని <<18951531>>BCB<<>> కోరినట్లు చెప్పాయి.