News October 28, 2024

శాప్ నెట్‌ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: సొసైటీ ఫర్ ఏపీ నెట్‌వర్క్(శాప్ నెట్)ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్ నెట్ సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేసింది. 2018లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాప్ నెట్, మన టీవీ ద్వారా విద్యారంగానికి సేవలు అందించింది. ఇప్పుడు ఆ సేవలను విద్యామండలి నుంచే సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

Similar News

News October 28, 2024

యంగ్ ప్లేయర్లకు IPLపైనే ఎక్కువ ఇంట్రస్ట్: MSK

image

భారత క్రికెట్ భవిష్యత్తుపై BCCI మాజీ సెలక్టర్ MSK ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్లలో చాలా మంది దేశానికి ఆడేకంటే IPL ఆడేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘IPLతో ప్లేయర్ల మైండ్‌సెట్ మారింది. అన్ని ఫార్మాట్లలో దూకుడుగా ఆడేస్తున్నారు. స్పిన్, స్వింగ్‌ను ఆడే నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు సచిన్, గంగూలీ వంటి వారు ఫార్మాట్‌కు తగ్గట్లు ఆడేవారు’ అని పేర్కొన్నారు.

News October 28, 2024

సూపర్ న్యూస్.. కృష్ణుడి పాత్రలో మహేశ్ బాబు?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రాజమౌళితో మూవీ షూటింగ్ ఇంకా మొదలు కాకపోగా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయన మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన చిత్రంలో క్లైమాక్స్‌లో కృష్ణుడిగా కనిపిస్తారని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించడం గమనార్హం. కాగా మహేశ్ పాత్రపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

News October 28, 2024

నాలుగు నెలల్లో రూ.47 వేల కోట్ల అప్పు: పేర్ని నాని

image

AP: సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై రూ.6.072 కోట్ల కరెంటు ఛార్జీల భారం మోపారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో ఇసుక బంగారంతో సమానంగా మారిందని అన్నారు.