News October 28, 2024

శాప్ నెట్‌ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: సొసైటీ ఫర్ ఏపీ నెట్‌వర్క్(శాప్ నెట్)ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్ నెట్ సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేసింది. 2018లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాప్ నెట్, మన టీవీ ద్వారా విద్యారంగానికి సేవలు అందించింది. ఇప్పుడు ఆ సేవలను విద్యామండలి నుంచే సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

Similar News

News November 4, 2024

ఇవాళే టెట్ నోటిఫికేషన్

image

TG: ఇవాళ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మే, జూన్‌లో తొలి టెట్ నిర్వహించింది. ఇవాళ రెండో టెట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వనుండగా జనవరిలో పరీక్షలు జరపనుంది. మేలో నిర్వహించిన టెట్‌లో 1.09 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఇటీవల డీఎస్సీ కూడా పూర్తి కావడంతో ఈసారి పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గొచ్చని అధికారులు భావిస్తున్నారు.

News November 4, 2024

రేపటి నుంచి వరల్డ్ ట్రావెల్ మార్కెట్.. నేడు లండన్‌కు మంత్రి జూపల్లి

image

TG: ఈనెల 5 నుంచి 7 వరకు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ లండన్‌కు వెళ్లనున్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన UK పర్యటన సాగనుంది. ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపద తెలిసేలా పర్యాటక శాఖ అక్కడ ఓ స్టాల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రావెల్ మార్ట్‌లో 100కు పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు.

News November 4, 2024

ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌.. నలుగురు యువకులు మృతి

image

AP: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాడిపర్రులో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మృతులను వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉండ్రాజవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.