News October 28, 2024
మా అమ్మ ఏఎన్నార్‌కు వీరాభిమాని: చిరంజీవి

నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు తన తల్లి అంజనా దేవి వీరాభిమాని అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఏఎన్నార్ ఫ్యాన్స్‌లో సీనియర్ ఫ్యాన్ మా అమ్మ. నేను కడుపులో ఉన్నప్పుడు ఆయన సినిమా విడుదలైంది. అమ్మ నిండు గర్భిణిగా ఉన్నా తన బలవంతం మీద నాన్న జట్కా బండిలో సినిమాకు తీసుకెళ్లారు. దారిలో బండి తిరగబడినా సినిమా చూశాకే తిరిగి ఇంటికి వచ్చారు. ఏఎన్నార్ అంటే అమ్మకు అంత పిచ్చి ఉండేది’ అని వెల్లడించారు.
Similar News
News November 4, 2025
JNTUHలో నిరసనలు, బంద్‌లు నిషేధం

JNTUHలో బంద్‌లు, నిరసనల పేరుతో విద్యా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం పూర్తిగా నిషేధించడమైనది ప్రిన్సిపల్ జి.వి నర్సింహ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలని, అప్రయోజక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిష్ఠను దెబ్బతీసే, విద్యా కార్యక్రమాలకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 4, 2025
చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ సెటైర్లు

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై YCP అధినేత జగన్ సెటైర్లు వేశారు. ‘ఇంత విపత్కర పరిస్థితిలో సీఎం ఒక రోజు వస్తాడు. అలా చాపర్‌లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్‌కు పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడటానికి పోతాడు’ అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
News November 4, 2025
రేపు పలు జిల్లాలకు వర్షసూచన

AP: కోస్తా తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీంతో రేపు కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, KDP, TPT జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వానలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ 5PM వరకు బాపట్లలో 61.5MM, నంద్యాల(D) నందికొట్కూరులో 51.7MM అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పింది.


