News October 28, 2024
మా అమ్మ ఏఎన్నార్‌కు వీరాభిమాని: చిరంజీవి

నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు తన తల్లి అంజనా దేవి వీరాభిమాని అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఏఎన్నార్ ఫ్యాన్స్‌లో సీనియర్ ఫ్యాన్ మా అమ్మ. నేను కడుపులో ఉన్నప్పుడు ఆయన సినిమా విడుదలైంది. అమ్మ నిండు గర్భిణిగా ఉన్నా తన బలవంతం మీద నాన్న జట్కా బండిలో సినిమాకు తీసుకెళ్లారు. దారిలో బండి తిరగబడినా సినిమా చూశాకే తిరిగి ఇంటికి వచ్చారు. ఏఎన్నార్ అంటే అమ్మకు అంత పిచ్చి ఉండేది’ అని వెల్లడించారు.
Similar News
News November 19, 2025
వరంగల్: సూరీడూ.. జల్దీ రావయ్యా..!

ఉమ్మడి వరంగల్‌లో చలి పెరిగిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లలోని విద్యార్థులు చలికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు హాస్టళ్లు ఊరి చివర్లో ఉండటంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో ఉదయమే ఎండ కోసం తపిస్తున్నారు. సూర్యుడు రాగానే విద్యార్థులంతా బయటకు వచ్చి ఎండలో నిలబడుతున్నారు. దీంతో ఎండతో పాటు విటమిన్-డి సైతం లభిస్తుంది. పర్వతగిరిలోని KGBV హాస్టల్ విద్యార్థులు ఉదయం వేళలో ఇలా ఎండలో నిలబడుతున్నారు.
News November 19, 2025
NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.


