News October 29, 2024
మ్యాక్స్‌వెల్‌ను బ్లాక్ చేసిన కోహ్లీ.. ఎందుకంటే?
మ్యాక్స్‌వెల్, కోహ్లీ మంచి ఫ్రెండ్స్. అయితే గతంలో మ్యాక్సీ చేసిన ఓ పనికి కోపమొచ్చి అతణ్ని కోహ్లీ ఇన్‌స్టాలో బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని మ్యాక్సీ స్వయంగా వెల్లడించారు. కోహ్లీని బ్లాక్ చేశావా అని అడిగితే ‘అవును బ్లాక్ చేశా. నువ్వు రాంచీ టెస్టు(IND vs AUS 2017)లో నన్ను ఎగతాళి చేశావు. అందుకే’ అని తనకు బదులిచ్చినట్లు మ్యాక్సీ చెప్పారు. ఆ తర్వాత కోహ్లీ తనను అన్‌బ్లాక్ చేసినట్లు కూడా మ్యాక్సీ తెలిపారు.
Similar News
News October 31, 2024
కరెన్సీ: ఏ నోటు తయారీకి ఎంత ఖర్చు?
మనం నిత్యం ఉపయోగించే ₹10, ₹20, ₹50, ₹100 నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా?. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం ₹10 నోటు తయారీకి ₹0.96 ఖర్చవుతుంది. అదే ₹20 నోటుకి ₹0.95 *₹50 నోటుకి ₹1.13 *₹100 నోటుకి ₹1.77 *₹200 నోటుకి ₹2.37 *అలాగే ₹500 నోటుకి ₹2.29 ఖర్చవుతుంది. ₹200 నోటు తయారీకి ₹500 నోటు తయారీ కంటే ఖర్చు ఎక్కువ కావడం గమనార్హం.
News October 31, 2024
RCB రిటెన్షన్ ఫైనల్ లిస్ట్ ఇదే?
తమ రిటెన్షన్ లిస్ట్‌పై RCB ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఓ పజిల్‌ను పోస్ట్ చేసింది. ‘పజిల్‌లో తమ ఆటగాళ్ల రిటెన్షన్లు దాగి ఉన్నాయి, కనుక్కోండి’ అంటూ హింట్ ఇచ్చింది. కాగా ఈ పజిల్‌లో మ్యాక్స్‌వెల్, కోహ్లీ, గ్రీన్, పటీదార్, డుప్లెసిస్, విల్ జాక్స్, సిరాజ్, యశ్ దయాల్, అనూజ్ రావత్ పేర్లు దాగి ఉన్నాయి. వీరిలో కొందరిని కచ్చితంగా రిటైన్ చేసుకుంటుందని సమాచారం.
News October 31, 2024
గుడ్.. బాగా చేశారు: సీఎం చంద్రబాబు
AP: విజయవాడలో ఇటీవల నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను విజయవంతం చేశారంటూ పలువురు అధికారులను సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు. ఈ నెల 22న విజయవాడ పున్నమి ఘాట్ వద్ద కృష్ణా తీరాన 5,500లకు పైగా డ్రోన్లతో నిర్వహించిన షో అద్భుతంగా ఉందని కొనియాడారు. ఎక్కడా ఎలాంటి అంతరాయాలు లేకుండా సమన్వయంతో అధికారులు వ్యవహరించారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు.