News October 29, 2024
మ్యాక్స్‌వెల్‌ను బ్లాక్ చేసిన కోహ్లీ.. ఎందుకంటే?
మ్యాక్స్‌వెల్, కోహ్లీ మంచి ఫ్రెండ్స్. అయితే గతంలో మ్యాక్సీ చేసిన ఓ పనికి కోపమొచ్చి అతణ్ని కోహ్లీ ఇన్‌స్టాలో బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని మ్యాక్సీ స్వయంగా వెల్లడించారు. కోహ్లీని బ్లాక్ చేశావా అని అడిగితే ‘అవును బ్లాక్ చేశా. నువ్వు రాంచీ టెస్టు(IND vs AUS 2017)లో నన్ను ఎగతాళి చేశావు. అందుకే’ అని తనకు బదులిచ్చినట్లు మ్యాక్సీ చెప్పారు. ఆ తర్వాత కోహ్లీ తనను అన్‌బ్లాక్ చేసినట్లు కూడా మ్యాక్సీ తెలిపారు.
Similar News
News November 4, 2024
GET READY: సాయంత్రం 5.04కు ట్రైలర్
టాలీవుడ్ నటుడు నిఖిల్, రుక్మిణి వసంత్ జంటగా నటిస్తోన్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, తాజా ఇంటర్వ్యూలో ఇది రెగ్యులర్ మూవీలా ఉండదని, స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని నిఖిల్ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
News November 4, 2024
త్వరలో FMCG ఉత్పత్తుల ధరల పెంపు?
షాంపూలు, సబ్బులు, బిస్కెట్లు వంటి రోజువారీ వాడుకునే FMCG ఉత్పత్తుల ధరలు త్వరలోనే పెరిగే అవకాశం ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా SEPలో సంస్థల మార్జిన్లు తగ్గడం, పామాయిల్, కాఫీ, కోకో వంటి ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో సంస్థలు ధరల పెంపు సిగ్నల్స్ పంపాయి. పట్టణాల్లో HUL, గోద్రెజ్,మారికో, ITC, టాటా FMCG ప్రొడక్ట్స్ వినియోగం తగ్గడంపై పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. త్వరలో ధరల పెంపుపై ప్రకటన చేసే ఛాన్సుంది.
News November 4, 2024
‘స్పిరిట్’లో ప్రభాస్ హీరోయిన్ ఈమేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ ప్రీ పొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి చిత్రీకరణ మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నయనతార నటిస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. ‘స్పిరిట్’ స్క్రిప్టు నయన్‌కు నచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 2007లో వీరిద్దరూ కలిసి ‘యోగి’లో నటించారు.