News October 29, 2024
టీడీపీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఇసుక: VSR

AP: టీడీపీ పచ్చ ఇసుకాసురులు ప్రజల్ని హింసిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘ఉచిత ఇసుక ఇస్తామంటూ ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు తిరగబడండి అంటూ పిలుపునిస్తున్నారు. దీన్ని చూస్తుంటే సీఎంగా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పాల్సిన పని లేదు. బాబుని పొగిడే పచ్చమీడియా ప్రజల ఇబ్బందుల్ని గమనించాలి. టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఇసుకను విడిపించండి’ అని Xలో విమర్శలు చేశారు.
Similar News
News January 15, 2026
మార్స్ కోసం ఆహారం.. రూ.6.75 కోట్ల ఆఫర్

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్: మార్స్ టు టేబుల్’ అనే ఛాలెంజ్‌ను ప్రారంభించింది. మార్స్‌కి ప్రయాణించే ఆస్ట్రోనాట్ల కోసం వేరే గ్రహంపై కూడా పెరిగి, వండుకొని తినగలిగే ఆహారం రూపొందించే వారికి 7.5 లక్షల డాలర్లు (సుమారు రూ.6.75 కోట్లు) ఇస్తామని NASA ప్రకటించింది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలని సూచించింది. ప్రపంచంలోని ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపింది.
News January 15, 2026
టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ

NZతో జరిగే 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్.. ఇప్పుడు టీ20లకు సైతం అందుబాటులో ఉండటం లేదు. జనవరి 21 నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న T20 వరల్డ్‌కప్‌కు ముందు ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది.
News January 15, 2026
రూ.1,499కే ఇండిగో విమాన టికెట్

విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించింది. ‘Sail into 2026’ పేరుతో దేశీయ రూట్లలో ఒకవైపు విమాన టికెట్ ధరను కేవలం రూ.1,499గా నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రారంభ ధర రూ.4,499గా వెల్లడించింది. ఈ ఆఫర్ ఈ నెల 16 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.


