News October 29, 2024

టీడీపీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఇసుక: VSR

image

AP: టీడీపీ పచ్చ ఇసుకాసురులు ప్రజల్ని హింసిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘ఉచిత ఇసుక ఇస్తామంటూ ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు తిరగబడండి అంటూ పిలుపునిస్తున్నారు. దీన్ని చూస్తుంటే సీఎంగా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పాల్సిన పని లేదు. బాబుని పొగిడే పచ్చమీడియా ప్రజల ఇబ్బందుల్ని గమనించాలి. టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఇసుకను విడిపించండి’ అని Xలో విమర్శలు చేశారు.

Similar News

News November 14, 2024

రికార్డు నెలకొల్పిన అర్ష్‌దీప్ సింగ్

image

భారత పేస్ సెన్సేషన్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా నిలిచారు. సౌతాఫ్రికాతో జరిగిన 3వ టీ20లో సింగ్ 3 వికెట్లు తీశారు. దీంతో టీ20 కెరీర్‌లో మొత్తం 92 వికెట్లు సొంతం చేసుకొని టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్(90), బుమ్రా(89) ఉన్నారు. మొత్తంగా చూస్తే స్పిన్నర్ చాహల్(96) టాప్‌లో ఉన్నారు.

News November 14, 2024

నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

* 1949: బాలల దినోత్సవం
* 1889: భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జననం.(ఫొటోలో)
* 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం.
* 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం.
* 2020: తెలంగాణ నీటిపారుదల దినోత్సవం.
* ప్రపంచ మధుమేహ దినోత్సవం.

News November 14, 2024

మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ వద్దు: పవన్

image

AP: విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా అందిస్తున్న ఆహారం నాణ్యతలో రాజీ పడవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.1,854 కోట్లు కేటాయించిందని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో నాణ్యతా లేదనే ఫిర్యాదులు తన దృష్టికి రావడంతో ఆయన ఇలా స్పందించారు. అధికారులు తనిఖీలు చేపట్టి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.