News October 30, 2024
కార్పొరేట్ నయా ట్రెండ్.. ‘సైలెంట్ ఫైరింగ్’!
కార్పొరేట్ సెక్టార్‌లో పొమ్మనలేక పొగబెట్టడం తరహాలో ఉద్యోగుల సైలెంట్ ఫైరింగ్ మొదలైనట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. ఉద్యోగులకు కఠిన టాస్కులు ఇవ్వడం, WFH తొలగించడంతో చాలా మంది జాబ్స్‌కు గుడ్ బై చెప్పేలా చేస్తున్నారంది. ఆ స్థానాలను AIతో భర్తీ చేస్తారని పేర్కొంది. అయితే మనుషులు చేసే అన్ని టాస్క్‌లను AI చేయలేదని, వచ్చే పదేళ్లలో 5% ఉద్యోగాలనే AI భర్తీ చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Similar News
News November 18, 2024
మణిపుర్ మంటలు: రిజైన్ చేయనున్న CM బిరేన్?
మణిపుర్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM బిరేన్‌సింగ్ పదవిని వీడే అవకాశం ఉంది. లేదా బలవంతంగా ఆయనతో రాజీనామా చేయిస్తారని సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఆయన BJP MLAలతో సమావేశం అవుతున్నారు. ఇందులో అనూహ్య నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే కాన్‌రాడ్ సంగ్మా నాయకత్వంలోని NPP ప్రభుత్వం నుంచి తప్పుకుంది. మైతేయ్ ప్రజలపై కుకీ మిలిటెంట్ల దాడులతో రాష్ట్రంలో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే.
News November 18, 2024
జగనన్న కాలనీలపై విచారణ చేపట్టండి: స్పీకర్ ఆదేశం
AP: వైసీపీ హయాంలో ప్రారంభించిన జగనన్న కాలనీలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. అధికారుల నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొందరు అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ జగనన్న ఇళ్లపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.
News November 18, 2024
గాలి కాలుష్యంతో ఏటా 20 లక్షల మంది మృతి!
దేశంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతక వ్యాధులతో ఏటా లక్షల మంది చనిపోతున్నారని ఆందోళన చెందుతుంటాం. అయితే, నాణ్యమైన గాలిని పీల్చుకోలేకపోవడం వల్ల కూడా ఏటా ఇండియాలో దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం మీకు తెలుసా? కలుషితమైన గాలిని పీల్చి శ్వాసకోశ వ్యాధులు, ఇతర రోగాలతో బాధపడుతూ నిత్యం 5400 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వం ఈ మహమ్మారిపై దృష్టిసారించాలని నెటిజన్లు కోరుతున్నారు.