News November 18, 2024
జగనన్న కాలనీలపై విచారణ చేపట్టండి: స్పీకర్ ఆదేశం
AP: వైసీపీ హయాంలో ప్రారంభించిన జగనన్న కాలనీలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. అధికారుల నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొందరు అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ జగనన్న ఇళ్లపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.
Similar News
News December 6, 2024
పుష్ప-2 ALL TIME RECORD
అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా కలెక్షన్లు కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ పొందిన ఈ సినిమా తొలిరోజు నైజాంలో ఆల్ టైం రికార్డు సాధించింది. తాజా PR లెక్కల ప్రకారం ఏకంగా రూ.25 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో పుష్ప రాజ్ మాస్ జాతర ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.
News December 6, 2024
మళ్లీ ఆదుకున్న నితీశ్ రెడ్డి
పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆదుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, అడిలైడ్ టెస్టులోనూ ఆపద్బాంధవుడయ్యారు. 3 సిక్సులు, 3 ఫోర్లతో 54 బంతుల్లో 42 రన్స్ చేసి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చారు. పింక్ బాల్ స్వింగ్ అవుతుండటంతో మేటి బ్యాటర్లు చేతులెత్తేసినా నితీశ్ టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. భారత్‌కు సరైన ఆల్‌రౌండర్ దొరికాడంటూ నెట్టింట నితీశ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News December 6, 2024
రోదసిలో నడవనున్న సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది రోదసిలో నడవనున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆమె సిద్ధం చేసుకుంటున్నారు. సూట్స్‌లో డేటా రికార్డర్ బాక్స్, ఆక్సిజన్ పనితీరు వంటివాటిపై ఆమె పనిచేస్తున్నారని నాసా తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమికి తిరిగిరానున్నారు. వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో 6 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే.